సాయి ధరమ్ తేజ్ కెరీర్ ని చూసిన వారెవరైనా అస్సలు సాయి తేజ్ హీరోగా నిలదొక్కుకుంటారా అంటారు.. ఎందుకంటే అయన చేసిన సినిమాల్లో హిట్ లకన్నా ఫ్లాప్ లే ఎక్కువగా ఉన్నాయి.. తొలి చిత్రం రేయ్ తోనే అయన ఢీలా పడిపోయాడు.. రెండో సినిమా వచ్చాక కానీ ఆ సినిమా రిలీజ్ కి ముహూర్తం కుదరలేదు. మరి తొలి రెండు సినిమాలు హిట్ అయ్యాయా అంటే వాటి ద్వారా సాయి తేజ్ కి బ్యాడ్ నేమ్ వచ్చిందనే చెప్పాలి.. మూడో సినిమా గా చేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా పర్వాలేదనిపించుకుంది.. సుప్రీమ్ సినిమానే సాయి తేజ్ కి పెద్ద హిట్ కాగా ఆ సినిమా తర్వాత దాదాపు అరడజను సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి..