రవితేజ 'క్రాక్' సినిమా రిలీజ్ డేట్ కన్ ఫర్మ్  అయినట్లుగానే కనిపిస్తుంది..అయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా పూర్తయ్యి చాల రోజులే అయినా కరోనా కారణంగా రిలీజ్ కి నోచుకోలేదు.. దాంతో థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చింది.  దీనికి ముందు రవితేజ హిట్ చూసి చాలా రోజులైపోయింది.. అయన చేసిన అరడజను సినిమాలు భారీ పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న క్రాక్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు..