హీరో రామ్  ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ కొట్టినా ఎందుకో డల్ గా కనిపిస్తున్నాడు. లాక్ డౌన్ దగ్గరినుంచి ఆయననుంచి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు.. తన రాబోయే సినిమా రెడ్ గురించి ఎలాంటి ప్రమోషన్ కూడా చెయ్యట్లేదు.. నిజానికి ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ కి కరెక్ట్ టైం లో ఆ సినిమా హిట్ ఇచ్చిందని చెప్పాలి.. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన హిట్ ఉత్సాహంతో రామ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమా చేశాడు. వీరి కాంబో లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమా ఫై మంచి అంచనాలున్నాయి..