తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికల పర్వం, ఆంధ్ర లో తిరుపతి, మూడు రాజధానుల అంశం మరుగులో దేశంలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. దేశం నడిబొడ్డున రైతులు మోడీ కి వ్యతిరేకంగా పెద్ద పెద్ద నిరసనలు చేస్తున్నారు.. ఇటీవలే అయన ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డుకెక్కారు.. వ్యవసాయాధారిత దేశమైన మన దేశంలో రైతుల ఓట్లే కీలకం.. వారు ఎవరికి ఓట్లు వేస్తే వారికే పట్టం.. అయితే ఇది అందరికి తెలిసిందే.. అయినా తరతరాలుగా రైతులకే అన్యాయం జరుగుతుంది.. భారీగా రైతుల ఆత్మహత్యలు జరిగేవి బహుశా మనదేశంలోనే కావచ్చు..