టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా ఉన్న వంశీ పైడిపల్లి కి ఇప్పుడు టైం అస్సలు బాలేదని చెప్పాలి.. టాలెంట్ ఉన్నా ఎక్కువ గుర్తింపు రాని దర్శకులలో మొదట చెప్పుకోవాల్సిందిఈ డైరెక్టర్ నే.. అయన సినిమాల్లో డైరెక్షన్ వాల్యూస్ చాల బాగా ఉంటాయి.. ఎక్కడా ఒక్క షాట్ కూడా రాంగ్ డైరెక్షన్ లో కనిపించదు.. ఈ తరం దర్శకులు ఒక సినిమా ను ఎంత పర్ఫెక్ట్ గా చేయాలో ఈయనను చూసి నేర్చుకోవచ్చు.. కానీ ఆయనకు సినిమా అవకాశాలు మాత్రం ఎక్కువగా రావడం లేదు..