యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా తో హిట్ కొట్టి ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా లో నటిస్తున్నాడు.టాలీవుడ్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ సినిమా కూడా లేని రాజమౌళి చేస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలు ఉన్నాయి.. తన సినిమాలను ఎంతో అద్భుతంగా చెక్కుతాడని ఆయనను టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు. ఒక్కో సినిమా తో హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ స్థాయిని మార్చాడు కూడా. తన డైరెక్షన్ విలువలతో హాలీవుడ్ ఆశ్చర్య పరిచేలా సినిమా చేసి అతి తక్కువ కాలంలో దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరుపొందారు.