దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతుంది.. ఢిల్లీ లో వ్యవసాయ బిల్లుకి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల గురించే.. ఈరోజు భారత్ బంద్ కూడా సక్సెస్ కావడంతో యావత్ భారతదేశం నుంచి ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో తప్పా అంతటా బంద్ జరిగింది.. తెలంగాణ లో అయితే టీ ఆర్ ఎస్ కార్యకర్తలు రోడ్డు మీదకొచ్చి బీజేపీ పాలనను విమర్శించారు. కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమంలో రైతు బిల్లును వెనక్కి తీసుకోవడమనే ఒకే ఒక్క ఎజెండా తో ముందుకు సాగుతున్నారు రైతులు..