నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగు సినిమాలను ఒప్పుకున్న సంగతి తెలిసిందే.. రాధే శ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలను ఒప్పుకున్న ప్రభాస్ ఇటీవలే ప్రశాంత్ నీల్ సినిమా ను కూడా అనౌన్స్ చేశాడు.వీటిలో రాధే శ్యామ్ తప్పా మిగితా సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే..ఒక్కోటి ఒక్కో స్పెషల్ ఉన్న సినిమా.. ఇందులో రాధే శ్యామ్ సినిమా ముందుగా రిలీజ్ అవుతుండగా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. వేసవి కానీ వచ్చే దసరా కి కానీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.