తెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోయాయి. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పుండుమీద కారణం చాలినంత పనవుతుంది. దానికి తోడు బీజేపీ బలపడుతుండడం కూడా ఆయనకు ఏమాత్రం నచ్చడంలేదు.. నిజానికి కేసీఆర్ పై వ్యతిరేకత తేవడంలో ప్రతిపక్షాలు ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో కరోనా వ్యాప్తి ని అరొకట్టలేకపోయారని, సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని, ఉస్మానియా ఆసుపత్రి వివాదంలో, శ్రీశైలం ప్రమాదం విషయం ఇలా అన్ని కేసీఆర్ కావాలని చేసినట్లుగా విపక్షాలు ఒక్కసారిగా దండెత్తాయి..