గతంలో ఎప్పుడు లేనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారు.. ఎప్పుడైనా ఏకపక్షంగా గెలిచి అధికారంలోకి రావడం కేసీఆర్ స్పెషల్.. కానీ ఇప్పుడు గ్రేటర్ లో హాంగ్ ఏర్పడింది.. ఏ పార్టీ కి మేజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో ఈ హాంగ్ ఏర్పడగా టీ ఆర్ ఎస్ మేయర్ పీఠం ఎక్కడానికి ఎంఐఎం ఖచ్చితంగా సహాయపడాల్సిన పరిస్థితి వచ్చింది. టీ ఆర్ ఎస్ 55 సీట్లు రాగ,బీజేపీ కి 49 , ఎంఐఎం కి 44 , కాంగ్రెస్ కు రెండు స్థానాలు వచ్చాయి.. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ ఉద్యమాన్ని ఒంటిచేత్తో నడిపి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ ట్రాప్ లో పడిపోయినట్లే కన్పిస్తుంది.