తెరాస పార్టీ పరిస్థితి రోజు రోజు కి అధ్వాన్నమైపోతున్న నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ స్థితి కొంత భయాందోళనలకు గురి చేస్తుంది. గ్రేటర్ లో జరిగిన పరిణామమే ఈ ఆలోచనలకూ కారణం అంటున్నారు.. ఇటీవలే కేటీఆర్ పార్టీ మీటింగ్ లో ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి కారణం సిట్టింగ్ అభ్యర్థులను మార్చకపోవడమే.. వారి మీద వ్యతిరేకత వల్లే పార్టీ లో చాల చోట్ల ఓడిపోయాం అని అయన అన్నారు.. పార్టీ సిట్టింగులను మార్చిన చోట పార్టీ గెలిచింది.. మార్చని చోట ఓడిపోయిందని అన్నారు కేటీఆర్.. దీంతో ఈసారి సిట్టింగ్ లకు ప్రమాదమే అన్న చర్చ పార్టీ లో జరుగుతుంది..