తెలంగాణ లో బీజేపీ వరుస గెలుపులతో అధికార పార్టీ ని భయపెట్టిస్తుంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్న బీజేపీ పార్టీ ఇప్పటినుంచే అందరిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే దుబ్బాక లో, గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది.. ఈ ఫలితాలతో ప్రజలు తమకే మద్దతుగా ఉన్నారని వారికి అర్థమవుతుంది. దీనికి కారణం ప్రజల వ్యతిరేకత మాత్రమే.. తమపై నమ్మకం కాదని తెలిసి ఆ నమ్మకం సాధించడం కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు.