గత రెండు మూడు రోజులనుంచి జగన్ తెలంగాణ లో వైసీపీ పార్టీ పనులు ప్రారంభిస్తారని వార్తలు జోరుగా వస్తున్నాయి. ఏపీ లో తాను ఎలాగైతే పార్టీ ని నడిపించారో, తెలంగాణ లో అయన చెల్లెలు షర్మిల పార్టీ కి నాయకత్వాన్ని అందిస్తారని కూడా వార్తలు వచ్చాయి.. అయితే తెలంగాణ లో ని ప్రతిపక్షాలు దీన్ని ఎలా అర్థం చేసుకున్నాయంటే.. వైసీపీ తెలంగాణ కి రావడం చూస్తుంటే కేసీఆర్ కుట్రలో భాగమే అన్నారు.. ఇక్కడి ఓట్లను చీల్చడమే లక్ష్యంగా కేసీఆర్ పథకం వేశారని అన్నారు..