తెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోయాయి. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పుండుమీద కారణం చాలినంత పనవుతుంది. బీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచిన సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.