రాష్ట్రంలో పలు ఓటములతో టీ ఆర్ ఎస్ పార్టీ సతమతమవుతుంటే కొంతమంది టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేల అరాచకం పార్టీ పేరును ఇంకా చెడగొడుతున్నాయి. ఇప్పటికే ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని మొన్నటి దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల సాక్షిగా తేలింది. దాన్ని కవర్ చేసుకోవాలని ప్రయత్నంలో పార్టీ మంతనాలు, వ్యూహాలు రచిస్తుంటే కొంతమంది గులాబీ నేతలు తమకు ఉన్న అధికార గర్వాన్ని చూపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గించేది పోయి పెంచేలా చేస్తున్న ఈ చర్యలు ఇప్పుడు దేనికి దారి తీస్తాయో తెలీట్లేదు.