తమిళ హీరో విజయ్ మాస్టర్ సినిమా కరోనా లాక్ డౌన్ కన్నా ముందే రిలీజ్ కి రెడీ గా ఉన్నా రిలీజ్ కాలేదు. దాంతో భారీ గ్యాప్ వచ్చి సినిమా విడుదలకు నోచుకోలేదు..ఈ సినిమా ని OTT లో రిలీజ్ చేయడానికి ట్రై చేసినా ఎందుకో వర్కౌట్ కాలేదు. సినిమా టీం మొత్తం ధియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు.. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ కావడంతో రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అందరు ఎదురుచూస్తున్నారు. కార్తీక్ ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.