ఏలూరు లో ఇటీవలే పరిస్థితులను చూస్తూనే అక్కడికి వెళ్లాలంటేనే అందరు భయపడుతున్నారు.. అక్కడ నీరు కలుషితం కావడంతో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. ఇలాంటి సమయంలో అక్కడ షూటింగ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ రిస్క్ చేస్తునందని మెగా కాంపౌండ్ అభిప్రాయపడుతుంది. సాయి ధరమ్ తేజ్ - 'ప్రస్థానం' దేవకట్టా కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఏలూరుకి షిఫ్ట్ అవ్వబోతుందని తెలుస్తోంది.