2019 ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఎలా అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అన్ని నియోజకవర్గాలు అని చెప్పలేం కానీ దాదాపు ఓ యాభై నియోజకవర్గాల్లో టీడీపీ భవిష్యత్ లో కోలుకోకుండా చేశాడు జగన్.. అయితే ఎప్పటినుంచో బలంగా ఉన్న టీడీపీ ఒక్కసారి ఓడిపోతే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇటీవలే పార్లమెంట్ ఇంచార్జి లను నియమించిన చంద్రబాబు కు ఆయా ప్రాంతాల్లో లీడర్ ల నియామకం చేపట్టినప్పుడు ఈ ఏరియా ల్లో ఇంత వీక్ గా పార్టీ ఉందని ఓ అంచనాకి వచ్చారు.