బీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. దుబ్బాక లో గెలిచినా సంబరాలకంటే గ్రేటర్ లో ఓడిన సంబరాలు మిన్నంటుతున్నాయి.. గ్రేటర్ ఫలితాలు వారిలో లేని కాంఫిడెన్స్ ను పెంచుతున్నాయి. దానికి తోడు కేంద్రం కూడా ఉడతా సాయం ఇస్తుండడంతో పార్టీ నేతలు ఇంకా రెచ్చిపోతున్నారు.. ఇప్పటికే కిషన్ రెడ్డి కి కేంద్ర మంత్రి పదవి ఇవ్వగా, ఇప్పుడు పార్టీ ని ఒక్క తాటితో నడిపించి గెలుపు తీరాలకు చేర్చబోతున్న బండి సంజయ్ కి త్వరలో ఓ పదవి ఇవ్వబోతున్నారట..