తెలంగాణ లో బీజేపీ గెలవడమేమో కానీ ఆ గెలుపు తమ గెలుపు అన్నట్లు ఏపీ బీజేపీ నేతలు విర్రవీగిపోతున్నారు.. సోము వీర్రాజు అయితే ఈ గెలుపు ను తనకు ఆపాదించుకుని తానే గెలిచినట్లు ఫీల్ అవుతున్నాడు. అయితే తెలంగాణ లో పరిస్థితులు వేరు, ఏపీ లో పరిస్థితులు వేరు అన్న సంగతి ఎందుకు సోము గుర్తించట్లేదో కానీ గెలుపుమీద చాలానే ఆశలు పెట్టుకున్నారు.  అయితే గ్రౌండ్ లెవెల్లో బలం లేనిదే ఎలా బీజేపీ పార్టీ గెలుపు పై ఆశలు పెట్టుకున్నారో అర్థం కావట్లేదు.