తెలంగాణాలో లాగే ఏపీ లో కూడా బీజేపీ బలపడాలని చూస్తుంది..అందుకోసం భారీ ప్రణాళికలు వేసి ఇప్పటికే కొన్ని మంచి ఫలితాలను సాధించింది. సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ పార్టీ మునుపటిలా అయితే లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇది తమకేం ప్రమాదం కాకపోయినా వైసీపీ టీ ఆర్ ఎస్ లా లైట్ తీసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లిచుకోవాల్సిందే..ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధించి తమ సత్తా చాటాలని భావిస్తుంది బీజేపీ.