విజయ్ దేవరకొండకు తండ్రిగా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోందట. అర్జున్ క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఏ తెలుగు సినిమా కూడా హిట్ అవ్వలేదు. అర్జున్ నటించిన 'శ్రీఆంజనేయం' 'లై' 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' వంటి సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. దీంతో అర్జున్ టాలీవుడ్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన సినిమాలు ప్లాప్ అవుతాయనే బ్యాడ్ సెంటిమెంట్ సినీ జనాల్లో ఉంది. ఇప్పుడు ఈ సెంటిమెంటే రౌడీ ఫ్యాన్స్ ను భయపెడుతోంది.