సలార్ లో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ టాక్. జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఆయనకు ఎంత అద్భుతంగా వర్క్ అవుట్ అయ్యిందో చూసాం. సోలోగా మనమంతా చేస్తే చూడలేదు కానీ తమిళనాడులో కూడా విజయ్ జిల్లా బ్రహ్మాండంగా ఆడింది.ఇప్పటి జెనరేషన్ హీరోలతో మోహన్ లాల్ కాంబో బాగా పండుతోంది. అందుకే సలార్ లోనూ తనకో కీలక పాత్ర అది కూడా హీరో తర్వాత అంత ప్రాధాన్యం ఉండేదట. దాంతో ఆయన సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయని టాక్.