మెగా మేనల్లుడు గా టాలీవుడ్ లోకి రాబోతున్న వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రం ఉప్పెన.. బుచ్చిబాబు సానా దర్శకుడు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో కృతి శెట్టి హీరోయిన్ కాగా దేవి శ్రీ ప్రసాద్ స్నాగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబో తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.. టాలీవుడ్ లో ఇద్దరు హీరోలకు, అదీ అన్నదమ్ములకు ఒకే లాంటి పరిస్థితి ఎదురైంది. తొలి సినిమా రిలీజ్ చేయడంలో వారికి ఎందుకో విధి సైతం సహకరించదు.