రవితేజ 'క్రాక్' సినిమా రిలీజ్ కన్ ఫర్మ్  అయినట్లుగానే కనిపిస్తుంది.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తయ్యి చాల రోజులే అయినా కరోనా కారణంగా రిలీజ్ కి నోచుకోలేదు.. దాంతో థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు దియెటర్లు ఓపెన్ అవుతుండడంతో ఈ సినిమా ని సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు.. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైన్ లో ఉంచాడు రవితేజ..