సీనియర్ హీరోల్లో విభిన్న సినిమాలు చేస్తూ తనకంటూ వెరైటీ ఇమేజ్ దక్కించుకుంటున్న హీరో వెంకటేష్.. మల్టీ స్టారర్ చిత్రాలకు ఆజ్యం పోసిన వెంకటేష్ టాలీవుడ్ లో వెరైటీ సినిమాలు ఎలా చేయాలో కూడా అందరికి నేర్పించాడు. ఇక వెంకటేష్ ప్రస్తుతం నారప్ప అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. చిత్రీకరణ దశలో ఉన్న ఎగ్జైటింగ్ సినిమాల్లో నారప్ప ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.