చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా ను చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకుడు.   ఈ సినిమా నుంచి ఇటీవలే మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా ఈ పోస్టర్ సినిమా పై మంచి అంచనాలు పెంచింది.. మణిశర్మ ఈ సినిమా కి సంగీతం అందిస్తుండగా హీరోయిన్  గా కాజల్ నటిస్తుంది..తాజాగా ఆచార్యలో అరవింద్ స్వామి నటించబోతున్నట్టు తెలిసింది. కథ ప్రకారం ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన ఒక కీలకమైన పాత్రకు ఇతనే బెస్ట్ ఛాయస్ అని అప్రోచ్ అయ్యారట. అధికారికంగా చెప్పలేదు కానీ చర్చలు జరిగాయని తెలిసింది.