టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సినిమా మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న  ఉప్పెన.. మెగా హీరోనుంచి రాబోతున్న మరో హీరో కావడంతో ఈ సినిమా పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు..అందులోనూ మెగా మేనల్లుడు, స్టార్ హీరో గా ఎదుగుతున్న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు హీరోగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనీ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు..