బాహుబలి ముందు వరకు ప్రభాస్ అంటే టాలీవుడ్ ప్రజలకే తెలుసు.. కానీ బాహుబలి రిలీజ్ తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది.. ఇప్పుడు అయన చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.. ఒక్క బాహుబలి సినిమా ప్రభాస్ కెరీర్ ని ఎక్కడికో తీసుకుపోయింది. సాహో సినిమా పెద్ద ఫ్లాప్ గా మిగిలిపోయిన తర్వాత ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా మొదలై చాలారోజులు అవుతున్నా ప్రభాస్ అవుట్ ఫుట్ మీద సంతృప్తి తో లేకపోవడం వల్ల సినిమా ని మళ్ళీ రీ షూట్ చేస్తున్నారు.