తెలంగాణ లో గెలుస్తామన్న ఉత్సాహమో కానీ, కేంద్రంలో తమదే అధికార పార్టీ అన్న అహంకారంతో కానీ ఏపీ బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాస్త ఎక్కువయ్యాయి అని చెప్పొచ్చు.. సోము వీర్రాజు వచ్చాక పార్టీ కొంత దూసుకెళ్తున్న విషయం నిజమే అయినా వారి బలం ఎంత వుంది, ప్రజల్లో నమ్మకం ఎంత వుంది అన్న విషయం మాత్రం ఇంకా తేటతెల్లమైపోలేదు. ఇప్పటికే తమ ప్రచారం తో టీడీపీ ని వెనక్కి నెట్టేయడంలో దాదాపు సఫలమయ్యింది. చంద్రబాబు ను పూర్తి గా బ్యాడ్ చేసి జగన్ మంచి పేరు వచ్చేలా చేసి బీజేపీ కొంత హెల్ప్ చేసింది.. ఎందుకంటే జగన్ కు తన చేతికి మట్టంటకుండా బీజేపీ నే ఆ పనిచేసింది.