అనిల్ రావిపూడి దర్శకత్వంలో F3 సినిమా రాబోతుందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగా ఈ సినిమా అనౌన్సమెంట్ ఈ రోజు జరిగింది.. ఈ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F2 ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే ఫామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది.  టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు చాలా తక్కువ ఉన్నారని చెప్పొచ్చు.. తొలి సినిమా హిట్ కాగానే డైరెక్టర్స్ రెండో సినిమాతోనే తుస్ మనిపిస్తారు. కానీ సినిమా సినిమా కి ఎదుగుతూ ఒదిగి ఉంది మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టడం కొద్దీ మంది డైరెక్టర్ లకే చెల్లుతుంది.. అలాంటి వారిలో ఒకరు అనిల్ రావిపూడి.