వరుస రీమేక్ సినిమాలు చేస్తూ పోతున్న మెగా స్టార్ చిరంజీవి త్వరలో మలయాళం సినిమా లూసిఫర్ ని, తమిళ రీమేక్ ని వేదాళం ని తెలుగులో చేస్తున్న విషయం తెలిసిందే.. తన సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో ప్రేక్షకులను మెప్పించే విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటాడు.. అందుకే డైరెక్ట్ కథలకన్నా రీమేక్ లనే ఎక్కువ నమ్ముకుంటున్నాడు చిరు.  కథ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా ని పక్కనపెట్టేయడంలో ఎలాంటి ఆలోచన చేయదు..