సుకుమార్ సినిమా వస్తుందంటే చాలు అయన ఫ్యాన్స్ సినిమాలో ఎలాంటి వెరైటీ ట్విస్ట్ లు పెడతాడో అని అందరు తెగ ఎదురుచూస్తుంటారు. అయన చేసిన గత చిత్రం రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రామ్ చరణ్ ను అలా గతంలో ఎప్పుడు చూడలేదు.. అలా చూపించే ధైర్యం చేసి సుకుమార్ పెద్ద సాహసమే చేశాడు.. అయిన హీరో పాత్ర కి చెవుడునే లోపం పెట్టి హిట్ కొట్టిన ఈతరం దర్శకుడు ఈయనే కావచ్చు. రామ్ చరణ్ కూడా ఇలాంటి సినిమా ని ఎంకరేజ్ చేసి సాలిడ్ హిట్ కొట్టాడు..