పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో అభిమానులను ఉంచాడు.. ఇప్పటికే నాలుగు సినిమా లు ఓకే చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లోపు వీలైనన్ని సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు..  ఈ సినిమాలు పూర్తి చేసే సరికి ఎన్నికల సమయం దగ్గరపడుతుంది.. అప్పుడు ప్రచారం పనిలో పవన్ కళ్యాణ్ వెళ్తే ఇక సినిమాలకు స్వస్తి చెప్పేలా ఉన్నాడని అభిమానులు వాపోతున్నారు.. నిజానికి ఈ ఎన్నికల్లో పవన్ గెలిచి ఉంటే అయన దాదాపు సినిమాలు చేయకపోయి ఉండేవారు కానీ దేవుడి దయవల్ల అయన ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ ఆయనను వెండి తెరపై చూడాలన్న కోరిక నెరవేరుతుంది అని ఫాన్స్ అంటున్నారు..