పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఇప్పటికే మూడు సినిమా లు చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో పవన్ మరో సినిమా ని అనౌన్స్ చేసి అభిమానులను ఎంతో ఉత్సాహపరిచారు.. అయ్యప్పనుం కోషియం రీమేక్ ని తెలుగు లో పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు.. దసరా కానుకగా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకి దర్శకత్వం వహించిన సాగర్ కే చంద్ర ఈ చిత్రనికి దర్శకుడు కాగా తమన్ మరోసారి సంగీతం అందిస్తున్నాడు..