తెలంగాణ లో బీజేపీ బలపడడం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక మరో ఎత్తు అవుతుంది.. గత కొన్ని రోజులుగా తెలంగాణ లో కాంగ్రెస్  పార్టీ కి సానుకూల ఫలితాలు రాలేదు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ పార్టీ ఒక్కసారిగా ప్రధాన ప్రతిపక్షంగా తయారైంది. కాంగ్రెస్ లాంటి మేటి పార్టీ ని వెనక్కి తిరిగి చుకోకుండా చేసింది.. తమ విధానాలతో టీ ఆర్ ఎస్ పార్టీ కి ఎక్కువపోట్టిన వారి టార్గెట్ తో కాంగ్రెస్ కకావికలం అయిపొయింది.   దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఉత్తమకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయగా ఇప్పుడు ఆ ప్లేస్ కోసం రాష్ట్రంలోని కొంతమంది నేతలు పోటీ పడుతున్నారు..