నేడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయనకు ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా మోహన్ లాల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. " హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్ సార్.. మీకు ఈ సంవత్సరం అద్బుతంగా నిలవాలని కోరుకుంటున్నాను " అని ట్వీట్ చేస్తూ.. మోహన్ లాల్ తో దిగిన ఓ పోటో ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇక మోహన్ లాల్ పలు విజయవంతమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: