ఏపీ సీఎం జగన్ నిన్న విశాఖ వెళ్లారు.. ఆయన రాక సందర్భంగా అక్కడి పోలీసులు అత్యుత్సాహం చూపారు.. ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో గంటల తరబడి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. దీంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం సీఎం జగన్ దృష్టికి వచ్చింది. ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన అధికారులు తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


తన రాక కోసం ట్రాఫిక్‌ను గంటల తరబడి నిలిపి వేయడం ఏంటని సీఎం జగన్ మండిపడ్డారు. ఈ విషయంపై ఆయన డీజీపీతో మాట్లాడారు. తన వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగినందుకు చింతిస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆయన అధికారులకు గట్టిగా చెప్పారు. ఇంకోసారి ఇలా జరగొద్దని చెప్పారు. సీఎం జగన్ స్పందనపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: