అమరావతి అభివృద్ధి కోసం 15 ఎకరాల భూమిని విక్రయించాలని జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏపీలో ఆసక్తికరమైన చర్చకు తెర లేపుతోంది. ఈ 15 ఎకరాలు అమ్మేందుకు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.  హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రకారమే భూముల్ని విక్రయించాలని నిర్ణయించినట్టు ఆ ఉత్తర్వుల్లో చెప్పారట.


రాజధానిలో 248.34 ఎకరాల్ని ఎకరం రూ.10 కోట్ల చొప్పున అమ్మేందుకు జగన్ సర్కారు ప్లాన్ రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే అమరావతిలో ఎకరం పది కోట్లు పెట్టి ఎవరు కొంటారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మంగళగిరికి దగ్గర జాతీయ రహదారికి దగ్గర్లో అభివృద్ధి చేసిన లేఅవుట్‌లో స్థలాలు అమ్మేందుకు సీఆర్‌డీఏ గతంలో ప్రయత్నించింది. అక్కడ కొనేందుకు ఒకరిద్దరు తప్ప ఎవరూ ఆసక్తి చూపలేదు. మరి ఇప్పుడు రాజధానిలో ఎకరం రూ.10 కోట్లకు ఎవరు కొంటారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: