త్వరలో మోదీ హైదరాబాద్ రాబోతున్నారు. ఇక్కడ పార్టీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు పెడుతుంటే కేంద్రం ఏమీ చేయడం లేదని విమర్శిస్తున్నారు. రైతు బంధు కోసం
రెండు రోజుల్లో మొత్తం 36.41 లక్షల ఎకరాలకు సాయం చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి అంటున్నారు.

ఈ ఏడాది వానా కాలంలో 68.10 లక్షల మంది రైతులు రైతుబంధుకు అర్హులయ్యారన్న మంత్రి.. ఇంత గొప్పగా చేస్తుంటే ప్రధాని, కేంద్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కారు రైతులను మోసం చేసిందని నిరంజన్ రెడ్డి అంటున్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ పంపు సెట్లకు మీటర్లు బిగించబోమని హైదరాబాద్ వేదికగా జరిగే బీజేపీ డిక్లరేషన్ లో ప్రకటించాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: