షార్ట్ కట్ రాజకీయ మార్గాలు దేశాన్ని నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.కష్టించి పని చేయడానికి మరో ప్రత్యామ్నాయం లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకునే నాటికి కేవలం కష్టించి పని చేయడం ద్వారా మాత్రమే దేశాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లగలమని ప్రధాని నరేంద్ర మోదీ  అన్నారు. దేశంలో షార్ట్ కట్ రాజకీయాలు పెద్ద సవాల్ అని ప్రధాని నరేంద్ర మోదీ  అభివర్ణించారు. అలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.



ఝార్ఖండ్ లోని దేవ్ ఘర్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడం సహా 16వేల 8వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ  శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  12 కిలోమీటర్లు రోడ్ షో నిర్వహించారు. జ్యోతిర్లింగ క్షేత్రం వైద్యనాథ్ లో ప్రధాని నరేంద్ర మోదీ  పూజలు నిర్వహించారు. భారత్ .... నమ్మకానికి, ఆధ్యాత్మికతకు కేంద్రం అని పేర్కొన్న మోదీ.. పుణ్యక్షేత్రాలు ఉత్తమ సమాజాన్ని, దేశాన్ని నిర్మించాయన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: