మన పొరుగున ఉన్న శ్రీలంక ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో చూశాం కదా.. కనీసం పెట్రోల్ దిగుమతి చేసుకునే సత్తా కూడా లేకుండా ఇబ్బంది పడుతోంది. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశంలో అరాచకం ప్రబలుతోంది. అయితే.. ఇప్పుడు మన పొరుగున ఉన్న మరో దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే కాబోతోందా.. అంటే అవుననే అనిపిస్తోంది.


పాకిస్తాన్‌ కూడా ఆర్థిక సంక్షోభం అంచునే ఉంది.  ఆ దేశ విదేశీ మారక నిల్వలు కేవలం 9.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌ కరెన్సీ విలువ రికార్డుస్థాయి కనిష్ఠానికి చేరుకుంది. అంతే కాదు.. పాకిస్తాన్ ప్రస్తుత  ఆదాయంలో 40 శాతం.. తీసుకున్న అప్పులపై వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ ఇటీవల ఐఎంఎఫ్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇంధన కొనుగోళ్ల కోసం భారీగా ఖర్చుపెడుతున్న పాకిస్థాన్‌కు ఈ ఒప్పందం కాస్త ఊరట ఇస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పాకిస్తాన్ కూడా మరో శ్రీలంక కావడం ఖాయం అంటున్నారు నిపుణులు.


మరింత సమాచారం తెలుసుకోండి: