యూరోపియన్ యూనియన్ మరోసారి రష్యాపై కన్నెర్ర చేసింది. ఎందుకంటే రష్యా ఇటీవల నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలను విలీనం చేసుకుంది కదా. ఇది యూరోపియన్ యూనియన్‌కు కంటగింపుగా మారింది. దీంతో ఉక్రెయిన్ కు చెందిన నాలుగుప్రాంతాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ.. యూరోపియన్ యూనియన్ రష్యాపై మరోసారి ఆంక్షలు విధించింది.

రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఇంధన ధరపై పరిమితి విధించింది. ఇంకా పలు ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. ఈ మేరకు బ్రస్సెల్స్ లో సమావేశమైన 27దేశాల యూరోపియన్ యూనియన్ అనేక నిర్ణయాలు తీసుకుంది. రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఇంధనం ధరపై పరిమితి విధించింది. యూరోపియన్ యూనియన్ నుంచి రష్యాకు ఎగుమతయ్యే విమానాల పరికరాలను తగ్గించింది. రష్యా నుంచి దిగుమతయ్యే స్టీల్ పై పరిమితులు విధించింది. కొత్త ఖాతాదారుల కోసం రష్యా ఇంధన ధరలు తగ్గించేలా రష్యా ఇంధన ఉత్పత్తులపై నిషేధం విధించాలని కూడా యూరోపియన్ యూనియన్ ఆలోచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: