కేంద్ర ప్రభుత్వ విధానాలను ఉభయ సభల్లో ఎండగట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అవసరమైతే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ దురదృష్టకర విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.


కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని.. రాష్ట్రం తో పాటు దేశంలోని ప్రజా సమస్యల పై గళమెత్తాలని కేసీఆర్ అన్నారు. కేంద్రం చేస్తున్న తప్పులను దేశం దృష్టికి తీసుకురావాలని.. పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతుల్లో కేంద్ర అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టాలని బీఆర్ఎస్‌ ఎంపీలకు కేసీఆర్ స్పష్టం చేశారు. కలిసివచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని సీఎం కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs