చినజీయర్‌ స్వామి మేనల్లుడు, ఆయన ట్రస్టు వ్యవహారాలు చూసుకునే విష్ణు స్వామిపై ఆంధ్రజ్యోతి పత్రిక సంచలన కథనం ప్రచురించింది. విష్ణు స్వామి పగలు స్వామి అవతారంలో ఉంటారని రాత్రికి రాక్‌స్టార్‌ అవుతారని రాసింది. విష్ణు స్వామి ఖరీదైన కారులో అమ్మాయిలతో షికార్లు చేస్తారని.. స్నేహితులతో కలిసి పబ్‌లు, హోటళ్లకు వెళ్తారని ప్రచురించింది.

అంతే కాదు.. విష్ణు స్వామికి రియల్టర్లతో ఆర్థిక బంధాలు ఉన్నాయని.. వాటి కారణంగానే ఆయన పక్కదారి పట్టారని.. జీయర్ తర్వాత ఉత్తరాధికారిగా ఆయనే అవుతారని ప్రచారం జరుగుతోందని ఆంధ్రజ్యోతి పరిశోధనాత్మక కథనం ఇచ్చింది. చినజీయర్‌ ఆశ్రమ వ్యవహారాలన్నీ అంతా తానై నడుపుతున్న విష్ణు స్వామి.. చినజీయర్‌ స్వామికి తెలియకుండానే ఆయన వెనకాల ఈ కథలన్నీ సాగిస్తున్నారని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఈ కథనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరి చినజీయర్‌ స్వామి ఎలా స్పందిస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

ABN