ఎన్నికల్లో దొంగఓట్లు, రిగ్గింగ్ వంటి సమస్యలు ఉంటాయి. అయితే మనం వెళ్లేసరికే మన ఓటు వేరే ఎవరో వేసి ఉంటే.. అప్పుడు ఏం చేయాలి.. ఈ సమస్యపై గతంలో ఏకంగా ఓ సినిమాయే వచ్చింది. ఐదేళ్ల క్రితం తమిళ హీరో విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన‘సర్కార్ సినిమాలో ఇదే కీలకాంశంగా ఉంటుంది. ఆ సినిమాలో విజయ్‌ సెక్షన్‌ 49(పి) ద్వారా తన ఓటు హక్కు దక్కించుకుంటారు.

అసలు ఈ సెక్షన్‌ 49(పి) అంటే ఏంటంటే.. పోలింగ్ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే ఈ సెక్షన్ ద్వారా ఓటు పొందొచ్చు. ఓటు వేరేవాళ్లు వేశారని భావించిన వ్యక్తి ఓటు కోల్పోయిన వ్యక్తి అతనేనని నిరూపించుకోవాలి.ఓటర్ గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను సమర్పించాలి. ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17(బి)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి. అప్పుడు పీవో టెండర్డ్ బ్యాలెట్ పేపర్‌ను ఆ వ్యక్తికి ఇస్తారు. దానిపై నచ్చిన అభ్యర్థికి ఓటేసి తిరిగి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: