నీట్‌, నెట్‌ పరీక్ష పత్రాల లీకేజీకి ప్రధాని బాధ్యత వహించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. పేపరు లీకేజీలు పరీక్షల రద్దు వల్ల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యువత భవిష్యత్తు గురించిన  బాధ్యత మోదీ, మంత్రులపై ఉందన్న అసదుద్దీన్ ఒవైసీ.. దేశ యువతకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలన్నారు.


ప్రభుత్వం నుంచి విద్యార్థులకు న్యాయం జరగాలని.. నరేంద్ర మోదీ ఎగ్జామ్ వారియర్ అంటూ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ప్రధాని మోదీ దేశ యువత భవిష్యత్తును పణంగా పెట్టారని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మొదట NEET UG పరీక్షను రద్దుచేసి  23 లక్షల మంది  విద్యార్థులకు అన్యాయం చేశారని.. ఆ తర్వత UGC-NET ద్వారా 9 లక్షల మంది  విద్యార్థులకు అన్యాయం చేశారని అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. CSIR-NET రద్దు చేసి 2 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న అసదుద్దీన్ ఒవైసీ.. ఇప్పుడు NEET-PG పరీక్షకు రాత్రి ముందు  రద్దు చేశారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: