చికెన్.. ఒకప్పుడు వారాంతంలో మాత్రమే తినే ఈ నోరూరించే వంటకం గత కొన్ని రోజులుగా రోజువారీ దినచర్యలో భాగమైపోయింది. మన దేశంలోనే కాదు ప్రపంచంలో చికెన్ కు మంచి గిరాకీ ఉంటుంది.. వారాంతాల్లో హాట్ కేకులా అమ్ముడవుతుంది.. కొంతమందికి రోజూ ముక్క లేనిదే ముద్ద దిగదు. అందుకే కాబోలు ప్రతిరోజు వారి డైనింగ్ లో చికెన్ ని భాగస్వామ్యం చేస్తుంటారు. ఇదివరకు పండగకు, పబ్బానికో చికెన్ ని తెచ్చుకునే వారు ఇప్పుడు మూడొస్తే చికెన్ అంటున్నారు.. మందు చిందులకు, పార్టీ లైనా, పండగలైనా ప్రతి ఒక్కరి మెనూ లో చికెన్ ఉండాల్సిందే.. పైగా చవక ధర.. ఊరుకుంటారా..