వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ మరోసారి మొదటి అప్రరకుబేర స్థానానికి ఎగబాకాడు. ఇటీవల ఫోర్బ్స్  విడుదల చేసిన బిల్లియనీర్ల జాబితాలో ఎలన్ మస్క్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే టెస్లా స్టాక్ ధరలు భారీగా పెరగటంతో మళ్ళీ ఎలన్ మస్క్మొదటి స్థానంలోకి వచ్చేశాడు. ఇదే సంవత్సరంలో అత్యధిక పాయింట్లు పొందిన టెస్లా షేర్ లు ఇప్పుడే పుంజుకున్నాయి. తాజాగా 2. 2 శాతం పెరిగి 791.36 డాలర్ల వద్ద ముగిసింది. దీనితో మరోసారి ఎలన్ మస్క్ ప్రధమస్థానాన్ని పొందాడు.  ఆయన సంపద విలువ 3.8 బిలియన్ డాలర్లు పెరిగి 203.4 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను దాటేసి మొదటిస్థానం దక్కించుకున్నాడు.

తాజా అపరకుబేర స్థానాల జాబితాలో ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉండగా, తరువాతి స్థానాలలో బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ లు ఉన్నారు. ఇటీవల ఎలన్ మస్క్అంతరిక్ష పరిశోధనల ప్రయోగాల కారణంగా బెజోస్, ఎలన్ మస్క్ ల మధ్య వివాదం నడుస్తుంది. అలాగే కొన్నాళ్లుగా అమెజాన్ షేర్ మార్కెట్లు కూడా నిదానంగా ఉండటంతో స్టాక్ విలువ 0.6 శాతం పడిపోయింది. దీనితో ఆయన ఆదాయం 197.7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది టెస్లా వ్యాపారం కూడా బాగా సాగడంతో ఎలన్ మస్క్మొదటి స్థానం సాధించడంలో దోహదం చేసింది.

టెస్లా విలువ 792 బిలియన్ డాలర్ల స్థాయిని పొందితే, స్పేస్ ఎక్స్ 74 బిలియన్ డాలర్లకు చేరింది. కేవలం వారంలో ఈక్విటీ ఫండ్ ద్వారా 1.16 బిలియన్ డాలర్లు సాదించగలిగాడు. 2020 లోనే ఎలన్ మస్క్ఆదాయం 720శాతం పెరిగి 125 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలన్ మస్క్200 బిలియన్ డాలర్లు దాటిన మూడో వ్యక్తిగా ఉన్నాడు. ఇంతకముందు ఈ రికార్డు బెజోస్, బెర్నార్డ్ దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆగష్టు లో బెజోస్ ఈ ఘనత సాధించగా, బెర్నార్డ్ గత నెలలోనే ఈ ఘనత సాధించాడు. ఇదే స్థాయిలో ఎలన్ మస్క్ముందుకు పోతే 2025 కల్లా తొలి ట్రిలియనీర్ (300బిలియన్ డాలర్లు)అవుతాడు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: