
Vivo Y75 5g ధర రూ. 21990గా ఖరారు చేశారు. ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్ Vivo ఇండియా ఈ-స్టోర్, ఇతర భాగస్వామి రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. దీని విక్రయాలు ప్రారంభం అయ్యాయి. Vivo 5g మొబైల్ ఫోన్ స్టార్‌లైట్, గ్లోయింగ్ గెలాక్సీ అనే రెండు కలర్ వేరియంట్‌లలో లభిస్తున్నది. ఈ స్మార్ట్‌ఫోన్ samsung సరసమైన 5g ఫోన్‌లైన Galaxy A22 5g, redmi సరసమైన 5g ఫోన్‌లతో కూడా పోటీ పడుతుంది.
Vivo Y75 5g 6.58 అంగుళాల ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ ప్లేను కలిగి ఉంటుంది. దీని రిజల్యూషన్ 2408X1080 పిక్సెల్స్ ఉంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 700 చిప్‌సెట్ అందుబాటులో ఉన్నది. ఇది 8 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. అదేవిధంగా ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ని కలిగి ఉంటుంది. లాక్ చేయబడిన స్మార్ట్‌ఫోన్ ఇది. అన్‌లాక్ చేయడానికి కూడా పని చేస్తుంది.
Vivo Y75 మొబైల్ ఫోన్ Android 12 ఆధారిత Funtouch OS 12లో పని చేస్తోంది. ఇందులో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 1 tb స్టోరేజ్, SD కార్డును కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ 18W టైప్ C ఛార్జింగ్ కూడా ఉంటుంది.
Vivo Y75 కెమెరా సెటప్ గురించి మాట్లాడాలంటే.. వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్ ఉంది. ఇది ఎఫ్ / 1.8 ఎపర్చర్‌తో వస్తుంది. ఇది 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకె కెమెరా కలిగి ఉంటుంది. సెల్ఫీ కోసం కంపెనీ 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించినది. సెల్ఫీ కెమెరా AI ఫేస్ బ్యూటిఫికేషన్‌తో వస్తున్నది.